ఫిల్మ్ ట్రివియా : న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ట్రైన్ అయిన తెలుగు నటుడు ఎవరో తెలుసా?

Published on Sep 23, 2020 7:20 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ నటుడు మన టాలీవుడ్ లో చాలా టాలెంట్ కలవాడు అని అంతా అంటుంటారు. తాను తీసిన ప్రతీ సినిమాలో నటనతో ఎంతో ఆకట్టుకునే ఈ నటుడు ఇపుడు అరకొరగానే చేస్తున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ నటుడు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. మరి ఆ టాలెంటెడ్ స్టార్ నటుడు ఎవరో మీకు తెలిస్తే కామెంట్స్ తెలియజేయండి. సరైన సమాధానాన్ని మేము తర్వాత అందిస్తాము.


సమాధానం :

ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే ఆ స్టార్ నటుడు మరెవరో కాదు అందరికీ బాగా తెలిసిన హీరో నారా రోహితే..నారా రోహిత్ ఎంత టాలెంట్ కలిగిన నటుడో అందరికీ తెలిసిందే. అతను న్యూయార్క్ కు చెందిన ఫిల్మ్ అకాడమీలో నటన మరియు ఫిల్మ్ మేకింగ్ లో ట్రైనింగ్ తీసుకొని తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సరైన సినిమా పడి నారా రోహిత్ మంచి కం బ్యాక్ ఇవ్వాలని చాలా మందే ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More