Filmfare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్.. పోటీలో ఉన్నది వీరే..!

Filmfare Awards 2026

టాలీవుడ్‌లో తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినిమాలకు అందించే ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2026 వేడుకకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 21న అట్టహాసంగా జరగనున్న ఈ వేడుక కోసం 2024లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సౌత్ ఇండియన్ చిత్రాల నామినేషన్ల జాబితా విడుదలైంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’, ‘హనుమాన్’ వంటి భారీ చిత్రాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సైతం అవార్డుల రేసులో నిలవడంతో, ఈసారి విజేతలు ఎవరనేది ఉత్కంఠగా మారింది.

ఇక ఈ సారి ‘బ్లాక్ లేడీ’ని దక్కించుకునేందుకు నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న జాబితాను ఓసారి చూద్దాం.

ఉత్తమ చిత్రం (Best Film) :

కల్కి 2898 ఏడీ
పుష్ప: ది రూల్
కమిటీ కుర్రోళ్లు
లక్కీ భాస్కర్
35 చిన్న కథ కాదు
హనుమాన్

ఉత్తమ దర్శకుడు (Best Director) :

నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడీ)
సుకుమార్ (పుష్ప: ది రూల్)
యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
నంద కిశోర్ (35 చిన్న కథ కాదు)
ప్రశాంత్ వర్మ (హనుమాన్)

ఉత్తమ నటుడు (Best Actor) :

అల్లు అర్జున్ (పుష్ప: ది రూల్)
ఎన్టీఆర్ (దేవర)
దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
నాని (సరిపోదా శనివారం)
తేజ సజ్జ (హనుమాన్)
సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)

ఉత్తమ నటి (Best Actress) :

నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
రష్మిక మందన్న (పుష్ప: ది రూల్)
అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్క్వేర్)
ఆషికా రంగనాథ్ (నా సామిరంగ)
మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటుడు:

అమితాబ్ బచ్చన్ (కల్కి)
సత్య (మత్తు వదలరా 2)
వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)
ధనంజయ్‌ (జీబ్రా)
ఎస్.జె. సూర్య (సరిపోదా శనివారం)
ఫహద్ ఫాజిల్ (పుష్ప 2)

ఉత్తమ సహాయ నటి:

శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)
అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
వరలక్ష్మి శరత్ కుమార్ (హనుమాన్)
శ్రద్ధా శ్రీనాథ్‌ (మెకానిక్‌ రాకీ)
రాశి సింగ్‌ (ప్రసన్నవదనం)

Exit mobile version