చిత్రీకరణలు నిలిపివేస్తాం… ఫెడరేషన్‌ నేతలు క్లారిటీ

TFI

నిర్మాతలకు సినీ కార్మికులకు మధ్య జరిగిన చర్చలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న 24 యూనియన్ల కార్మికులు వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈరోజు చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తాం. ఇప్పటికే షెడ్యూల్‌ ఉంటే ఒకట్రెండు రోజులు సమయం ఇస్తాం. షెడ్యూల్‌ ఉన్న వారితోనూ మాట్లాడి ఆ చిత్రీకరణలు కూడా నిలిపివేస్తాం’ అని తెలిపారు.

కార్మిక సంఘాల నేతలు ఇంకా మాట్లాడుతూ.. ‘నిర్మాత విశ్వప్రసాద్‌ నోటీసు ఎందుకు పంపారో మాకు తెలియదు. నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్‌ ఛాంబర్‌కు నోటీసులు పంపిస్తాం. నిర్మాత విశ్వప్రసాద్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన సినిమా షూటింగ్‌లకు హాజరుకాబోము. ఛాంబర్‌ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుంది’ అని ఫెడరేషన్‌ నేతలు క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version