అఖండ మ్యూజిక్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

Published on Nov 22, 2021 12:05 am IST

నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న ‘అఖండ’ సినిమా మ్యూజిక్ పూర్తి అయింది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా తమన్ ఈ చిత్రం మ్యూజిక్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘నాకు ఇష్టమైన దర్శకుడు బోయపాటి శ్రీనుగారితో మరో సినిమా చేశాను. అఖండ సినిమా డాల్బీ థియేటర్ మిక్స్ పూర్తి అయిందని, అవుట్ ఫుట్ అద్భుతం అనే సెన్స్ లో తమన్ పోస్ట్ చేశాడు.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఒక్కసారిగా సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. అసలు బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. అందుకే మొదటి నుంచి బోయపాటి ఈ సినిమా పై మరింత కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా సినిమా తీశాడు. అన్నిటికీ మించి గతంలో బాలయ్యతో చేసిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయాలు సాధించాయి.

మరి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కూడా హ్యాట్రిక్ అయ్యేలా ఉంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More