“వాల్తేరు వీరయ్య” ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

“వాల్తేరు వీరయ్య” ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Published on Nov 11, 2022 8:56 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న చిత్రం “వాల్తేరు వీరయ్య”. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇపుడు భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా సినిమా రిలీజ్ డేట్ కోసం అయితే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు వీరయ్య రాకకి సంక్రాంతిలో డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ జనవరి 13న రిలీజ్ చేసేందుకు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానున్నట్టు టాక్. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవి మేకర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు