ఫైనల్ గా “లైగర్” సస్పెన్స్ ఎలిమెంట్ పై క్లారిటీ వచ్చినట్టేగా.!

Published on May 10, 2022 7:05 am IST


మన టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కాంబోలో తెరకెక్కించిన ఒక మాస్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్”. పూరి మార్క్ లో తెరకెక్కించిన ఈ సినిమా భారీ స్థాయి అంచనాలు పెట్టుకొని పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచి అంతా బాగానే ఉంది కాని ఒక అంశం అయితే నిన్నటి వరకు సస్పెన్స్ గానే ఉంది. అదే ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరు అనేది.

నిజానికి పూరి ఏ సంగీత దర్శకున్ని తీసుకున్నా తన మార్క్ ఆల్బమ్ ని చాలా ట్రెండీ గా రాబడతారు. అలాగే ఎప్పుడు నుంచో తన సినిమాలకి మన తెలుగు తో పాటు బాలీవుడ్ సంగీత దర్శకులని కూడా దింపాడు. ఇప్పుడు ఫైనల్ గా లైగర్ ఆల్బమ్ సంగీత దర్శకుడు ఎవరు అన్నది కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. ఈ చిత్రానికి గాను హిందీ నుంచి విక్రమ్ మొంత్రోస్ ని పూరీ తీసుకున్నారు. తాను ఇచ్చిన ఫస్ట్ సాంగ్ లైగర్ థీమ్ ఎంత సాలిడ్ గా ఉందో కూడా విన్నాము. అయితే తాను ఈ ఒక సాంగ్ కి మాత్రమేనా లేదా సినిమా ఆల్బమ్ అంతా ఇస్తున్నాడా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :