ఫైనల్ గా “ఆచార్య” నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది.!

Published on Nov 24, 2021 4:20 pm IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ మెగా మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. భారీ అంచనాలతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్స్ గత కొన్ని రోజులు నుంచి స్టార్ట్ అయ్యాయి.

ఇక ఇదిలా ఉండగా సినిమాలో కీలక పాత్ర పోషించినటువంటి రామ్ చరణ్ రోల్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ముందు ఆచార్య టీజర్ చూసారు ఇక ఇప్పుడు సిద్ధ టీజర్ తో చరణ్ ని విట్నెస్ చెయ్యమని అదిరే పోస్టర్ తో ఈ కొత్త అప్డేట్ ని దింపారు.

మరి ఈ టీజర్ ని వచ్చే నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :