ఫైనల్ గా “ఆచార్య” రిలీజ్ అప్పటికి ఫిక్స్.!

Published on Sep 20, 2021 11:08 pm IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేలు మరో కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ఈ సినిమా రిలీజ్ పలు ఆసక్తిర వార్తలే వినిపిస్తూ వస్తుండగా నిన్ననే మెగాస్టార్ అసలు ఆచార్య ఎందుకు లేట్ అవుతుందో అసలు కారణం వెల్లడించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఆల్ మోస్ట్ ఎప్పుడుకి రావొచ్చు అన్నది స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి దీని ప్రకారం వచ్చే సంక్రాంతి రేస్ లో ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :