ఇంట్రెస్టింగ్..మహేష్ లైనప్ లోకి మరో మోస్ట్ అవైటెడ్ కాంబో?

Published on Jun 23, 2022 3:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చి తన స్టార్డం ని ఓ రేంజ్ లో వ్యాప్తి చెందించాలని కోరుకుంటున్న కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. అయితే మహేష్ ఒక్క తెలుగులోనే సినిమా చేసి హాలీవుడ్ రేంజ్ ట్రీట్ ఇచ్చిన చిత్రాలు లేకపోలేవు. అందుకే మహేష్ నేషనల్, ఇంటర్నేషనల్ ఎంట్రీ పట్ల అందరిలో కూడా ఒక రకమైన ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది.

మరి అలాంటి సాలిడ్ ట్రీట్ ఇచ్చిన మాస్టర్ పీస్ చిత్రం “1 నేనొక్కడినే”. దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా మహేష్ మరియు సుకుమార్ ల కెరీర్ లో ఒక బెస్ట్ వర్క్ గా నిలిచింది. అప్పట్లో మహేష్ నుంచి ఏ సినిమాకి కూడా చేయని హార్డ్ వర్క్ పైగా షర్ట్ లెస్ షాట్స్ తో ఎనలేని హైప్ ని ఈ చిత్రం నమోదు చేసింది.

మరి ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా పడితే చూడాలని ఎప్పుడు నుంచో అభిమానులు అనుకుంటున్నారు. అది మధ్యలో కూడా దగ్గరకు వచ్చి ఆగింది. మరి ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో సినిమా ఈసారి ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ కెరీర్ లో 30వ సినిమాగా అంటే రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత ఉండొచ్చని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :