ఫ్రీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “అవతార్ 2” ఇండియా వెర్షన్.!

Published on Jun 7, 2023 2:58 pm IST


గత ఏడాది వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “అవతార్ 2” అయితే రిలీజ్ కి రాగా పార్ట్ తో దాదాపుగా దాని రేంజ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్ వండర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఆల్ టైం హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ గా కూడా నిలిచింది.

మరి ఇండియన్ సినిమా దగ్గర 50 రోజులకి పైగా భారీ ఆదరణ అందుకున్న ఈ సినిమా ఓటిటి ఇండియన్ భాషల అన్ని వెర్షన్స్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అయితే మొదట ఈ సినిమా రెంటల్ గా స్ట్రీమింగ్ కి రాగ మరి ఫైనల్ గా అయితే ఈ అవైటెడ్ సినిమా ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే డిస్నీ+ హాట్ స్టార్ లో ఫ్రీ గా ఈ చిత్రం ఒరిజినల్ ఇంగ్లీష్ సహా తెలుగు, తమిళ్, హిందీ కన్నడ మరియు మళయాళ భాషల్లో అయితే ఈ సినిమా ఫుల్ క్లారిటీ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా అవతార్ మూవీ లవర్స్ ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :