చరణ్ గ్రేస్, పూజా కెమిస్ట్రీతో “ఆచార్య” మోస్ట్ అవైటెడ్ సాంగ్.!

Published on Nov 5, 2021 11:50 am IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ సినిమా “ఆచార్య”. మెగాస్టార్ కెరీర్ లో మరో బిగ్ బడ్జెట్ సినిమాగా ఇది తెరకెక్కింది. మరి అంతేకాకుండా ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే తన సరసన నటించింది.

మరి ఈ ఇద్దరి మధ్య డిజైన్ చేసిన సాంగ్ “నీలాంబరి” ని చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తుండగా వారి అంచనాలకు తగట్టుగా మణిశర్మ మళ్ళీ ఓ క్లీన్ మెలోడీ తన మార్క్ లో అందించారని చెప్పాలి. నిన్న ప్రోమోలోనే మణిశర్మ తన మార్క్ ని చూపించగా.

ఇప్పుడు ఫుల్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది అని చెప్పాలి. అలాగే సాంగ్ లో చరణ్, పూజా ల కెమిస్ట్రీ కానీ మధ్యలో చరణ్ గ్రేస్ ఫుల్ సింపుల్ స్టెప్స్ కానీ మరింత ఆకట్టుకున్నాయి. మరి ఈ సాంగ్ ఎంత మిలియన్ మార్క్ దగ్గర ఆగుతుందో చూడాలి. మరి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

నీలాంబరి సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :