ఫైనల్ గా అవైటింగ్ “చరణ్ 15” ఫస్ట్ లుక్ ఆరోజున.?

Published on Jan 20, 2023 6:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా కోసం తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ భారీ హైప్ కూడా నెలకొనగా ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి అభిమానులు సహా పాన్ ఇండియా ఆడియెన్స్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ అయితే ఈ మార్చ్ 27న చరణ్ బర్త్ డే కానుకగా అయితే రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ తొందరలోనే రానున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ తరుణం అతి త్వరలోనే ఉండనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50 వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :