అవైటెడ్ “హిట్” హిందీ రీమేక్ షురూ.!

Published on Sep 12, 2021 10:51 am IST


గత ఏడాది లాక్ డౌన్ కి ముందుగా వచ్చిన పలు హిట్ చిత్రాల్లో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన “హిట్ ది ఫస్ట్ కేస్” కూడా ఒకటి. నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన ఈ చిత్రం అప్పుడు తక్కువ రోజులే థియేటర్స్ లో ఉన్నా సినిమా లవర్స్ లో మాత్రం మంచి ఇంపాక్ట్ కలిగించింది. దీనితో ఈ సినిమా హింద్ రీమేక్ కి కూడా డిమాండ్ ఏర్పడగా దానిని హిందీలో తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సిద్ధం అయ్యారు.

బాలీవుడ్ లో టాలెంటడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కనుంది. మరి ఎప్పుడు నుంచో అవైటెడ్ గా మారిన ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమంతో షురూ అయ్యింది. మరి అంతే కాకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ఆల్రెడీ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చెయ్యగా కిషన్ కుమార్ మరియు కుల్దీప్ రాథోర్ లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :