“భీమ్లా నాయక్” సౌండ్ బాక్సులు బద్దలయ్యే అప్డేట్ వచ్చేసింది.!

Published on Dec 29, 2021 11:06 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మంచి పవర్ ఫుల్ అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్నారు. మరి అలా ఇప్పుడు చిత్ర యూనిట్ ఈరోజు ఒక క్రేజీ అనౌన్సమెంట్ ని అందిస్తున్నట్టుగా చెప్పిన సంగతి తెలిసిందే.

మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ అప్డేట్ ని మేకర్స్ అందించారు. భీమ్లా నాయక్ నుంచి మాస్ చార్ట్ బస్టర్ అయ్యినటువంటి లా లా భీమ్లా డీజే వెర్షన్ సాంగ్ ని ఈ డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకని సెలెబ్రేట్ చేసుకోడానికి సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ముందు సాంగ్ కే వేరే లెవెల్ బేస్ ట్యూన్ ఇచ్చిన థమన్ మళ్ళీ చాలా కాలం తర్వాత డీజే వెర్షన్ ని దింపుతున్నాడు. ఇక దీనితో 31 రాత్రి సౌండ్ బాక్సులు బద్దలవ్వడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :