టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ యాక్షన్ సీక్వెల్ చిత్రమే “డబుల్ ఇస్మార్ట్”. మరి గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి కొనసాగింపుగా వస్తున్నా ఈ చిత్రం కోసం రామ్ ఫ్యాన్స్ తో పాటుగా మాస్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గత కొన్నాళ్ల నుంచి అభిమానులు సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మే నెలలో రామ్ బర్త్ డే కానుకగా ఓ అప్డేట్ వస్తుంది అని ఆల్రెడీ బజ్ ఉంది.
ఇక ఎట్టకేలకి ఫైనల్ గా మేకర్స్ సాలిడ్ హింట్ ఇచ్చేసారు. రామ్ పోస్టర్ తో దీంతల్లి దిమాక్ కిరికిరి అవుతుంది ‘ఏదో వచ్చేలా ఉంది’ అంటూ అప్డేట్ పై కన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఇక దీని కోసం ఎదురు చూడటమే తరువాయి అని చెప్పాలి. ఇక భారీ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
Dhin thalli diMAKIKIRIKIRI aithandhi????
Edho Vacchelane undhi ????#DoubleISMART pic.twitter.com/ZmO9h3sDj6— Puri Connects (@PuriConnects) May 11, 2024