ఫైనల్ గా గోపీచంద్ ఆగిపోయిన సినిమాకి రిలీజ్ డేట్.!

Published on Oct 2, 2021 1:51 pm IST


మన టాలీవుడ్ మ్యాచో మెన్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సీటీమార్” తో సాలిడ్ కం బ్యాక్ అందుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులు కితమే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి టాక్ తో హిట్ గా నిలిచింది. అయితే గోపీచంద్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు బి గోపాల్ కాంబోలో తెరకెక్కించిన మాస్ యాక్షన్ డ్రామా “ఆరడుగుల బుల్లెట్” సినిమా కోసం మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 2015లో బహుశా రిలీజ్ దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో పలు కారణాల చేత ఆగిపోయింది.

మరి అప్పుడు నుంచి ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుంది అని గత ఏడాది బజ్ వినిపించింది కానీ తర్వాత థియేటర్స్ ఓపెన్ అవుతున్నందున మళ్ళీ థియేటర్స్ కే మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే ఫైనల్ గా ఈ సినిమాకి ఇప్పుడు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే ఈ అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే తాండ్ర రమేష్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :