అఫీషియల్: ‘బిగ్ బాస్ – 6’ గ్రాండ్ ఫినాలే విన్నర్ అతనే

అఫీషియల్: ‘బిగ్ బాస్ – 6’ గ్రాండ్ ఫినాలే విన్నర్ అతనే

Published on Dec 18, 2022 11:40 PM IST

తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు వచ్చినటువంటి అనేక క్రేజీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ అందుకొని మంచి టిఆర్పి రేటింగ్స్ తో కొన్నేళ్లుగా టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఇక తాజాగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 6 గత కొన్నాళ్లుగా మంచి ఆదరణతో దూసుకెళ్తుండగా నేడు సీజన్ 6 యొక్క గ్రాండ్ ఫినాలే ఎంతో భారీ లెవెల్ లో జరిగింది.

ఇక ఇప్పటికే హౌస్ లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఫైనల్ గా రేవంత్ ఈ సీజన్ యొక్క విన్నర్ గా నిలవగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు. ఇక విన్నర్ గా రేవంత్ ని కింగ్ నాగార్జున అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు సంబరాలతో మునిగి తేలుతున్నారు. కాగా షాకింగ్ గా విన్నర్ అనౌన్స్ మెంట్ జరిగే చివరి నిమిషంలో అదిరిపోయే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. వాస్తవానికి ఈ సీజన్‌ టైటిల్‌ను గెలుచుకున్నది శ్రీహాన్, అతడికి రేవంత్ కంటే ఒకశాతం అధికంగా ఓట్లు దక్కాయి.

అయితే విన్నర్‌ పేరును ప్రకటించడానికి ముందు నాగార్జున ఇచ్చిన బ్రీఫ్ కేస్ ఆఫర్‌‌ కి శ్రీహాన్ ఓకే చెప్పి 40 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్‌ను స్వీకరించాడు. దీనితో రేవంత్‌ను టైటిల్ విన్నర్‌గా ప్రకటించాల్సి వచ్చిందని నాగార్జున తెలిపారు. కాగా ఫైనల్ విన్నర్‌ అయిన రేవంత్ కు టైటిల్‌తో పాటు ఇంటిస్థలం, 10 లక్షల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 6 మంచి జోష్ తో మంచి ఆదరణతో ముగిసిందనే చెప్పాలి. మరి తదుపరి బిగ్ బాస్ సీజన్ 7 కోసం కొన్ని నెలల వరకు అభిమానులు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు