వైరల్ : ఫైనల్ గా తన పై వస్తున్న రూమర్స్ పై స్పందించిన కృతి సనన్

వైరల్ : ఫైనల్ గా తన పై వస్తున్న రూమర్స్ పై స్పందించిన కృతి సనన్

Published on Nov 30, 2022 7:01 AM IST

బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మంచి అవకాశాలతో సక్సెస్ లతో దూసుకెళ్తున్న కృతి సనన్ టాలీవుడ్ కితొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ అందుకున్నారు. అనంతరం నాగ చైతన్యతో దోచేయ్ మూవీ చేసిన కృతి, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో భారీ మైథలాజికల్ పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్ లో సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల బేధియా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒకానొక ప్రోగ్రాంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో యువ నటుడు వరుణ్ ధావన్ మాట్లాడుతూ కృతి సనన్ మనసు ఇక్కడ లేదు దీపికా పదుకొనే తో నటిస్తున్న ఒక నటుడి వద్ద ఉంది అంటూ కామెంట్స్ చేయడంతో అవి అప్పటి నుండి సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయ్యాయి.

వాటిని కొందరు బేస్ గా చేసుకుని కృతి సనన్, హీరో ప్రభాస్ తో డేటింగ్ లో ఉన్నారని అలానే త్వరలో పెళ్లి కూడా చేసుకోన్నారని తప్పుగా ప్రచారం చేయడంతో ఫైనల్ గా వాటిపై కొద్దిసేపటి క్రితం తన అఫీషియల్ ఇన్స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా స్పందించారు కృతి సనన్.

నిజానికి అటువంటి బేస్ లెస్ రూమర్స్ ని నమ్మవద్దని, తన పెళ్లి నిశ్చయం అయిందని వస్తున్నవి అంతా కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని అన్నారు. వరుణ్ సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారని, దయచేసి ఇటువంటివి ప్రచారం చేయవద్దని ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానితో ఆ పుకార్లకు పూర్తిగా అడ్డుకట్ట పడ్డట్లైంది. కాగా ప్రస్తుతం కృతి సనన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు