ఫైనల్ గా “లైగర్” టీం సంసిద్ధం అవుతున్నారా..?

ఫైనల్ గా “లైగర్” టీం సంసిద్ధం అవుతున్నారా..?

Published on Jul 1, 2022 11:00 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కమ్బోలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. మొత్తం పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే మైక్ టైసన్ కి బర్త్ డే విషెష్ తెలియజేయగా సినిమా ప్రమోషన్స్ లో అభిమానులు చాలా రోజులు నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే వీటిపై అన్నట్టుగా లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ “కమింగ్” అంటూ ట్వీట్ చేసాడు. దీనితో ఈ చిత్రం నుంచి ఇక వరుస అప్డేట్స్ సహా సాలిడ్ ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వడమే తరువాయి అని అర్ధం అవుతుంది. మరి విజయ్ ఇది ప్రమోషన్స్ కోసమేనా లేక వేరే అంశం కోసం చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్ జోహార్ లు నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు