ఎట్టకేలకు బ్యాలెట్ పద్ధతిలోనే “మా” ఎన్నికలు..!

Published on Oct 6, 2021 12:40 am IST


మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) ఎన్నికల పోలింగ్‌ను బ్యాలెట్‌ పద్దతిలోనే నిర్వహిస్తామని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ వివరణ ఇచ్చాడు. అయితే మా ఎన్నికలను పేపర్‌ బ్యాలెట్‌ విధానం ద్వారానే ఎన్నికలు జరపాలని మంచు విష్ణు కోరగా, ఈవీఎంల ద్వారా పోలింగ్‌ జరపాలని ప్రకాశ్‌ రాజ్‌ కోరారు. అయితే వీరి ప్రతి పాదనలను విన్న క్రమ శిక్షణ కమిటీ అన్ని విధాల ఆలోచించి పోలింగ్‌ బ్యాలెట్‌ విధానం ద్వారానే నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

2019లో సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ‘మా’ ఎన్నికలను బ్యాలెట్‌ పద్దతిలోనే పోలింగ్‌ నిర్వహిస్తామని, ఏపీ, తెలంగాణలో స్థానిక ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరిగాయని, ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించారని ఈ సందర్భంగా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ గుర్తు చేశారు.

సంబంధిత సమాచారం :