రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మహా సముద్రం”.!

Published on Nov 13, 2021 9:00 am IST

ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయ్యిన పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యిన చిత్రం “మహా సముద్రం” కూడా ఒకటి. శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఇంటెన్స్ డ్రామా ఇది. రిలీజ్ కి ముందు చాలా బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీనితో ఈ ఏడాది ప్లాప్ చిత్రాల జాబితాలోకే ఇది చేరిపోవాల్సి వచ్చింది.

పైగా ఈ సినిమాతో టాలీవుడ్ లోకి మళ్ళీ రీఎంట్రీ పై సిద్ధార్థ్ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఫైనల్ గా దెబ్బ తినక తప్పలేదు. మరి ఎట్టకేలకు ఈ సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసినట్టు తెలుస్తుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటిలోకి వచ్చింది. ఒకవేళ ఈ చిత్రాన్ని ఎవరైనా మిస్సయితే ఇప్పుడు చూడొచ్చు.

సంబంధిత సమాచారం :