ఫైనల్ గా మాస్ మహారాజ్ ఈజ్ బ్యాక్..!

ఫైనల్ గా మాస్ మహారాజ్ ఈజ్ బ్యాక్..!

Published on Dec 23, 2022 4:06 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ లవబుల్ స్టార్ హీరోస్ లో మన మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ కి హిట్ వస్తే తమ హీరోకి వచ్చినట్టే ప్రతి ఇతర హీరో అభిమాని కూడా ఫీల్ అవుతారు. ఇక కెరీర్ పరంగా చాలా పరాజయాల తర్వాత క్రాక్ తో తాను సాలిడ్ కం బ్యాక్ అందుకోగా అక్కడ నుంచి మళ్ళీ రవితేజ జెట్ స్పీడ్ లో కొన్ని చిత్రాలు చేసేసారు.

ఇక వాటిలో కూడా కొన్ని నిరాశపర్చగా వీటి తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన మరో చిత్రమే “ధమాకా”. ఇది అనుకున్న అంచనాలు అయితే అందుకొని హిట్ గా నిలిచింది అని చెప్పాలి. మొదటి ఆట తోనే పాజిటివ్ టాక్ ఈ సినిమాకి రాగా రవితేజ అయితే మళ్ళీ హిట్ కొట్టేసినట్టు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఒక్క తెలుగు స్టేట్స్ లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ ఆడియెన్స్ ని కూడా ఈ చిత్రం మెప్పించడంతో ఓవరాల్ గా ధమాకా తో రవితేజ ఈజ్ బ్యాక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు