ఎట్టకేలకు బాలయ్య నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ వచ్చేసింది.!

Published on Sep 17, 2021 4:03 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే దాని కన్నా ముందు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న వారికి మేకర్స్ ఇప్పుడు ఎట్టకేలకు అప్డేట్ ని ఇచ్చేసారు. ఈ అప్డేట్ వచ్చే సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అలాగే దేనికి ఒక ప్లెజెంట్ పోస్టర్ ని కూడా డిజైన్ చేశారు. సో ఎట్టకేలకు బాలయ్య నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అప్డేట్ వచ్చేసింది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :