“అంటే సుందరానికి” కోసం సిద్ధమైన నాచురల్ స్టార్.!

Published on May 24, 2022 11:59 am IST

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అవైటెడ్ సినిమా “అంటే సుందరానికి” కోసం తెలిసిందే. యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో నాని సరసన నజ్రియా ఫహద్ నటించింది. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కూడా ఈ సినిమా తోనే కావడంతో యూత్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక మరికొన్ని వారాల్లో సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా నాచురల్ స్టార్ నాని ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సిద్ధం అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేసాడు. ఈరోజు నుంచి తన సినిమా దసరా కి బ్రేక్ ఇచ్చి యాక్టీవ్ గా ఇప్పుడు అంటే సుందరానికి ప్రమోషన్స్ లో పాల్గొననున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ సినిమాకి నాని ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, మళయాళ భాషల్లో జూన్ 10న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :