ఫైనల్ గా “గని” సినిమాకి కొత్త రిలీజ్ డేట్.!

Published on Mar 2, 2022 11:00 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “గని”. దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లోనే మంచి అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉంది. అంతే కాకండా ఈ సినిమాకి వరుణ్ తేజ్ కూడా ఫిజికల్ గా చాలా కష్టపడ్డాడు.

తన పర్సనాలిటీకి తగ్గట్టుగా సాలిడ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకొని మంచి ఆసక్తి రేపాడు. అయితే ఈ సినిమా పలు కారణాల చేత అనేక సార్లు అలా వాయిదా పడుతూ వస్తుంది. మరి రీసెంట్ గా ఫిబ్రవరి 25న రిలీజ్ కావల్సిన ఈ చిత్రం “భీమ్లా నాయక్” వల్ల మళ్ళీ వాయిదా పడింది.

మరి అప్పుడే కొత్త రిలీజ్ డేట్ నే అందిస్తారని తెలిపారు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఆ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. దీని ప్రకారం అయితే ఈ చిత్రాన్ని రానున్న ఏప్రిల్ 8 న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రంలో వరుణ్ సరసన సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా అల్లు బాబీ మరియు సిద్ధూ ముద్ద లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :