ఫైనల్ గా లుక్ మార్చేసిన పవన్.?

ఫైనల్ గా లుక్ మార్చేసిన పవన్.?

Published on Dec 23, 2022 7:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతూ ఉండగా పవన్ ని నెవర్ బిఫోర్ లెవెల్లో దర్శకుడు క్రిష్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇక పవన్ మొదటి సారిగా ఓ పీరియాడిక్ రోల్ లో అలాగే వారియర్ గా కనిపించనుండగా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రంలో అయితే పవన్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. రీసెంట్ గానే గడ్డం లుక్స్ తో కొన్ని పతాక సన్నివేశాలు తెరకెక్కించిన మేకర్స్ ఆ షెడ్యూల్ ని అయితే విజయవంతంగా కంప్లీట్ చేసేసారు. ఇక మళ్ళీ అయితే పవన్ ఈ లుక్ నుంచి పాత లుక్ కి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. సినిమాని మొదట్లో అనౌన్స్ చేసిన లుక్స్ క్లీన్ షేవ్ లోకి మారినట్టుగా ఇప్పుడు కొన్ని ఫోటోలు అయితే వైరల్ గా మారాయి. ఇక నెక్స్ట్ షూట్ అంతా కూడా నార్మల్ గానే ఉంటుందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు