మొత్తానికి షూటింగ్ కి రెడీ అయిన ‘పుష్ప ది రూల్’… ఎప్పటినుండి అంటే ?

మొత్తానికి షూటింగ్ కి రెడీ అయిన ‘పుష్ప ది రూల్’… ఎప్పటినుండి అంటే ?

Published on Dec 11, 2022 3:00 AM IST


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ మూవీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ సక్సెస్ తో దేశవ్యాప్తంగా ఆడియన్స్ ని తన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక దీనికి సీక్వెల్ గా రూపొందనున్న మూవీ పుష్ప ది రూల్.

కాగా ఈ మూవీ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న పుష్ప ది రూల్ మూవీ సోమవారం నుండి హైదరాబాద్ లో జరుగనున్న ఫస్ట్ షెడ్యూల్ తో పట్టాలెక్కనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరోవైపు ఈ మూవీ కోసం పలు భారీ సెట్స్ సిద్ధం అయ్యాయని, మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతంగా సుకుమార్ ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు చెప్తోంది యూనిట్. కాగా ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఫహాద్ ఫాసిల్, భన్వర్ సింగ్ షకావత్ అనే నెగటివ్ పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో పుష్ప ది రూల్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు