ఫైనల్ గా క్రేజీ ప్రాజెక్ట్ పై చరణ్ ఫోకస్

ఫైనల్ గా క్రేజీ ప్రాజెక్ట్ పై చరణ్ ఫోకస్

Published on Jul 6, 2024 5:00 PM IST

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) అలాగే అంజలి లు హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” (Game Changer) కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు నుంచో షూటింగ్ జరుపుకుంటూనే వస్తున్నా ఈ సినిమా కోసం మెగా అభిమానులు అప్పుడు నుంచీ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

కానీ శంకర్ కి మధ్యలో “ఇండియన్ 2” (Indian 2) రావడంతో దానిని కూడా చేయాల్సి రావడంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన గేమ్ ఛేంజర్ వెనుకపడిపోయింది. అలా అప్పుడప్పుడు కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ వెళ్తున్న ఈ చిత్రంని ఫైనల్ గా రామ్ చరణ్ నేటితో ఫినిష్ చేసేసాడు. ఈరోజు ఫైనల్ సన్నివేశంతో అయితే చరణ్ తన పార్ట్ ని ముగించినట్టుగా తెలుస్తుంది.

ఇక వెంటనే చరణ్ తన ఫోకస్ మొత్తం తన నెక్స్ట్ భారీ చిత్రం దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న దానిపై పెట్టనున్నాడు. అయితే ఈ చిత్రానికి చరణ్ ముందుగా మేకోవర్ ని మార్చాల్సి ఉండగా ఇప్పుడు తన లుక్ ని మార్చే పని మొదలు పెట్టనున్నాడట. మొత్తానికి అయితే గేమ్ ఛేంజర్ తర్వాత ఒక సాలిడ్ లుక్ ని చరణ్ ప్రిపేర్ చేయబోతున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు