మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే “పెద్ది” (Peddi). టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ మాస్ స్పోర్ట్స్ డ్రామా పట్ల మెగా అభిమానుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో ప్రస్తుతం రెండో సాంగ్ ఎప్పుడు అనే టెన్షన్ ఎక్కువగా ఉంది.
ఆల్రెడీ వచ్చిన మెలోడీ సాంగ్ చికిరి చికిరి సెన్సేషన్ అయ్యింది. ఇక నెక్స్ట్ సాంగ్ గా ఓ మాస్ బీట్ ని వదులుతారని ఇది వరకు తెలిసిందే కానీ అసలు అది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ క్లారిటీ లేదు. అప్పుడు నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సాంగ్ పై మేకర్స్ ఎట్టకేలకి అప్డేట్ అందించారు.
రయ్ రయ్ రారా అంటూ సాగే ఈ సాంగ్ ని ఈ మార్చ్ 2 నుంచి వస్తుందని కన్ఫర్మ్ చేశారు. ఇక దీనిపై వదిలిన పోస్టర్ కూడా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. అలాగే ఏ ఆర్ రెహమాన్ ఈసారి ఎలాంటి ట్రీట్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ (Peddi) సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
