ఫైనల్ గా ఆస్కార్స్ కి “RRR”..డీటెయిల్స్ ఇవే.!

Published on Oct 6, 2022 8:00 am IST

మన తెలుగు సహా ఇండియన్ సినిమా ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తీసిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇది కాగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ లభించింది.

దీనితో అయితే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాలని ఇక భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎందరో దేశస్తులు కూడా కోరుకోవడం విశేషం. కానీ అనూహ్యంగా ఇండియన్ సినిమా ఫిలిం ఫెడరేషన్ వారి నుంచి ఈ చిత్రం పంపకవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే వారు పంపకపోయినప్పటికీ సినిమాకి ఉన్న ఒక పాజిబుల్ ద్వారా ఐతే ఈ చిత్రం ఆస్కార్స్ లో నిలిచినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఎఫ్ వై సి(ఫర్ యువర్ కన్సైడరేషన్) క్యాటగిరీ లో ఈ చిత్రం అయితే అనేక క్యాటగిరీ లలో ఎంపిక అయినట్టుగా తెలుస్తుంది. ఉత్తమ మోషన్ పిక్చర్ నుంచి ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్, బెస్ట్ స్కోర్, సాంగ్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంటి వాటిలో ఈ చిత్రం నిలిచింది. మొత్తానికి అయితే ఆడియెన్స్ డిమాండ్ ఈ చిత్రాన్ని ఆస్కార్స్ వరకు తీసుకెళ్లింది. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :