‘సాహసం శ్వాసగా..’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

‘సాహసం శ్వాసగా..’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Published on Aug 9, 2016 4:47 PM IST

Sahasem-savasaga-sagipo

దర్శకుడు గౌతమ్ మీనన్, హీరో నాగచైతన్యల కాంబినేషన్‌లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. టీజర్, ఆడియోతో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా చాలాకాలంగా ఓ సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. మొదట జూలై 15నే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా ప్రకటించినా, ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా మళ్ళీ గౌతమ్ మీనన్ పక్కా విడుదల తేదీని ప్రకటించేశారు.

సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదలవుతుందని గౌతమ్ మీనన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావచ్చిందని, ఇప్పుడు చెప్పిన డేట్‌కి పక్కాగా వచ్చేస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. గౌతమ్ మీనన్ – నాగ చైతన్య – ఏ.ఆర్.రహమాన్‌ల కాంబినేషన్‍లో ‘ఏ మాయ చేసావే’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడం ‘సాహసం శ్వాసగా సాగిపో’కు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు