ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన శింబు యాక్షన్ డ్రామా మూవీ తెలుగు వెర్షన్

Published on Jun 5, 2023 6:30 pm IST

కోలీవుడ్ నటుడు శింబు నటించిన యాక్షన్ డ్రామా మూవీ ఈశ్వరన్. తెలుగులో ఈశ్వరుడుగా 2021 లో విడుదలైన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ఈశ్వరుడు తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉందని, కాగా దానికి ఆన్‌లైన్‌లో చూడటానికి రూ. 79 చెల్లించాల్సి ఉంటుందని తాజాగా వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రకటించారు.

అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ యొక్క ఒరిజినల్ వర్షన్ స్ట్రీమింగ్ ఇప్పటికే అందుబాటులో ఉంది. సుశీంద్రన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, నందితా శ్వేత మరియు భారతీరాజా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంగీతం థమన్ స్వరాలు సమకుర్చారు. మాధవ్ మీడియా, డి కంపెనీ సంస్థల పై దీనిని బాలాజి గ్రాండ్ గా నిర్మించారు.

సంబంధిత సమాచారం :