ఫైనల్ గా “రాధే శ్యామ్” కోసం దిగిన మాస్ కటౌట్.!

Published on Mar 2, 2022 9:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి సాలిడ్ మాస్ కటౌట్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ఇలాంటి హీరో లేటెస్ట్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తో తెరకెక్కించిన చిత్రం “రాధే శ్యామ్” రిలీజ్ కి రెడీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ సహా మరికొన్ని కీలక అప్డేట్స్ ని రివీల్ చేసేందుకు మేకర్స్ అన్నీ సిద్ధం చేస్తుండగా..

ఇప్పుడు ప్రభాస్ కూడా తన భారీ సినిమాకి రెడీ అయ్యిపోయినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా ప్రభాస్ మళ్ళీ ముంబైలో అడుగు పెట్టాడట. దీనితో ప్రభాస్ ఇక్కడ రాధే శ్యామ్ పై నిర్విరామ ఇంటర్వూస్ ఇక ఉంటాయట. దీనితో ఇప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ పై మరింత ఆసక్తి నెలకొంది. మరి చూడాలి ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడతాడో. లాస్ట్ టైం సాహో కోసం పడ్డ కష్టం అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మర్చిపోలేరు.

సంబంధిత సమాచారం :