కరోనా నుంచి కోలుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.!

Published on Jan 12, 2022 7:03 am IST

ప్రస్తుతం కరోన మూడో వేవ్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏ స్థాయిలో విస్తరిస్తోంది అనేది అంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ వేవ్ లో కరోన కి టాలీవుడ్ మరియు కోలీవుడ్ కి చెందిన ప్రముఖులే ఒకరి తర్వాత ఒకరు గురి కావడం కాస్త ఆందోళనగా మారింది. అయితే ఈ సంఖ్య మరింత స్థాయిలో పెరగడం మరింత కలవర పెట్టగా వారిలో మన టాలీవుడ్ కి చెందిన స్టార్ మ్యూజిక్ కంపోజర్ అందులోని ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కి పాజిటివ్ రావడం షాక్ ఇచ్చింది. మరి దీనితో అనేక సినిమాల వర్క్స్ ఆగిపోయాయి.

కానీ ఎట్టకేలకు థమన్ ఒక గుడ్ న్యూస్ ఇచ్చాడు. తాను కరోనా నెగిటివ్ అయ్యానని తనకిన్నీ రోజులు చికిత్స చేసిన డాక్టర్స్ కి వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని నన్ను వారు ఒక చిన్న బేబీ లా చూసుకున్నారు. వారితో పాటు నా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అని చెప్పాడు. అలాగే అందరిని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించాడు.

సంబంధిత సమాచారం :