చిరంజీవి ‘ఖైదీ నెం 150’ కి వేదిక ఫిక్సైంది !

khaidi
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ విడుదలకు సిద్దమవుతున్న వేళ టీమ్ జనవరి 4న విజయవాడలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి అభిమానులను ఉత్సాహపరచాలని గత నెల నుండి సన్నాహాలు చేస్తుండగా మొన్న ఉన్నట్టుండి విజయవాడ అధికారులు హై కోర్ట్ ఉత్తర్వులతో ఈవెంటుకు పర్మిషన్ లేదనడంతో నిర్వాహకులతో పాటు అభిమానులు కూడా తీవ్ర స్థాయి నిరుత్సాహానికి గురయ్యారు. వెంటనే వేరే వేదిక కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

చివరికి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని గుంటూరు – విజయవాడల మధ్యలో గల హాయ్ ల్యాండ్ ను ఫైనల్ చేశారు. ఇప్పటికే ఖైదీ టీమ్ అక్కడకు చేరుకొని ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. ఈ వేడుక జనవరి 7వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి మొదలుకానుంది. ఈ వేడుకకు మెగా హీరోలంతా హాజరుకానున్నారు. ఇకపోతే సినిమా విడుదల తేదీని ఈరోజే ఫైనల్ చేయనున్నారు. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.