లేటెస్ట్..ఓటిటి లోకి వచ్చేసిన “విడుదల 1” తెలుగు వెర్షన్.!

Published on May 23, 2023 4:00 pm IST

ఈ ఏడాది తమిళ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఇంటెన్స్ పోలీస్ డ్రామా “విడుదలై 1” కూడా ఒకటి. మరి ఈ చిత్రం తమిళ్ లో భారీ హిట్ కావడంతో వెంటనే తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. కమెడియన్ సూరి హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఓటిటి లో కూడా వచ్చేసింది.

మరి మొదట తమిళ్ లో వచ్చిన ఈ సినిమా నెక్స్ట్ కన్నడ మరియు మళయాళ భాషల్లో అయితే స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఇన్ని భాషల్లో వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా ఇప్పుడు ఓటిటి లో అయితే వచ్చేసింది. స్ట్రీమింగ్ యాప్ జీ 5 లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యిన వారు ఇపుడు వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి అయితే మ్యాస్ట్రో ఇళయరాజా వింటేజ్ ట్యూన్స్ ని అందించారు.

సంబంధిత సమాచారం :