మరో రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “విడుదలై 1”.!

మరో రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “విడుదలై 1”.!

Published on May 21, 2023 10:04 AM IST

కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ నుంచి రీసెంట్ గా వచ్చిన మరో ఇంటెన్స్ నాచురల్ హార్డ్ హిట్టింగ్ డ్రామా “విడుదల 1”. కమెడియన్ సూరి ని ఓ సీరియస్ రోల్ లో పెట్టి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి సాలిడ్ రోల్ ఇచ్చి చేసిన ఈ ఇంటెన్స్ పోలీస్ డ్రామా అయితే తమిళ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. ఇక తమిళ్ లో అయితే చాలా త్వరగానే ఓటిటి లో వచ్చేసిన ఈ చిత్రం ఇప్పుడు మరో రెండు భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఇక మొదటగా తమిళ్ లో రిలీజ్ చేయగా ఇపుడు ఈ చిత్రం కన్నడ మరియు మళయాళ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక ఇందులో కూడా డైరెక్టర్ కట్ పూర్తి వెర్షన్ ని రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం కూడా అఫీషియల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జీ 5 లోనే స్ట్రీమ్ అవుతుంది. ఇక తెలుగులో కూడా అతి త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు