ఫైనల్ గా ఓటిటి లో వచ్చేసిన “వాల్తేరు వీరయ్య” బ్లాస్ట్.!

Published on Feb 27, 2023 12:06 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కథానాయకునిగా మాస్ మహారాజ రవితేజ మరో కీలక పాత్రలో నటించిన సాలిడ్ మాస్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి టాలీవుడ్ లో మొదటి బ్లాస్టింగ్ హిట్ గా నిలిచింది.

మరి మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అండ్ అధిక లాభాలు ఇచ్చిన సినిమాగా ఇది నిలవగా 50 రోజుల దిశగా ఈ చిత్రం దూసుకెళ్తుంది. ఇక ఈ గ్యాప్ లో అయితే ఓటిటి రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. అలా ఫైనల్ గా అయితే ఈ అవైటెడ్ చిత్రం దిగ్గజ ఓటిటి స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది.

రీసెంట్ గా పలు సినిమాలు ఆల్రెడీ స్ట్రీమింగ్ కి రాగా ఈ మాస్ హిట్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. మరి ఫైనల్ గా అయితే ఈరోజు నుంచి ఈ చిత్రం అదిరే ట్రీట్ ని ఇవ్వనుంది. ఇక ఓటిటి లో వీరయ్య వీరంగం ఎలా ఉంటుందో చూడాల్సిందే. మరి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ మరియు క్యాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :