ఎట్టకేలకు ‘2.0’ చివరి షెడ్యూల్ మొదలైంది..!
Published on Feb 1, 2017 3:06 pm IST


సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘రోబో’ 2010లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘2.0’ అనే సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవాల్సింది. కాగా డిసెంబర్ నెలలో మొదలుకావాల్సిన చివరి షెడ్యూల్ వరుసగా వాయిదా పడుతూ రావడంతో షూట్ ఇంకా పూర్తి కాలేదు.

ఇక ఎట్టకేలకు రెండు నెలల పాటు వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ ఆఖరి షెడ్యూల్ నిన్ననే మొదలై శరవేగంగా జరుగుతోంది. చెన్నై పరిసరాల్లో 2.0 కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, ఇప్పటికే మొదలైపోయిన పోస్ట్ ప్రొడక్షన్‌ కూడా శరవేగంగా జరుగుతుందని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. ఏప్రిల్ 14న తమిళ సంవత్సర కానుకగా ట్రైలర్ విడుదల కానుంది. బాలీవుడ్ సూపర్‍స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోగా నటిస్తున్నారు.

 
Like us on Facebook