శింబు పై FIR నటుడు ప్రశంశల వర్షం!

Published on Feb 8, 2022 11:30 am IST


కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ రాబోయే యాక్షన్ థ్రిల్లర్ FIR ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి ముందు, మేకర్స్ సినిమా థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. దీనిని స్టార్ నటుడు శింబు పాడారు. సంగీత దర్శకుడు అశ్వత్‌ స్వరపరిచిన థీమ్‌ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శింబు గాన నైపుణ్యానికి ముగ్ధుడైన అరణ్య నటుడు విష్ణు విశాల్ ట్విట్టర్‌లో ఇలా వ్రాశాడు.

కేవలం 30 నిమిషాలలో ఈ పాటను చేయడం జరిగింది అని. ఈ పాట తో మా మైండ్ బ్లో అయ్యింది అంటూ చెప్పుకొచ్చారు. విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో మంజిమా మోహన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో నటుడు రవితేజ సమర్పిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :