లేటెస్ట్ : మెగాస్టార్ మూవీ సెట్ లో అగ్నిప్రమాదం

Published on Feb 28, 2023 2:20 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. తొలిసారిగా మెగాస్టార్, మెగాపవర్ స్టార్ కలిసి నటించిన ఈ మూవీ ఫెయిల్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. అయితే ఈ మూవీలో ధర్మస్థలి కి సంబంధించి ఒక భారీ సెట్ ని రూపొందించారు యూనిట్. సినిమా ఎప్పుడో పూర్తి అయి రిలీజ్ అయినప్పటికీ కూడా ఇంకా ఆ సెట్ ని అలానే ఉంచేశారు.

కాగా నేడు ఆ సెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అది గమనించిన స్థానికులు వెంటనే దగ్గర్లోని వట్టినాగుల పల్లి ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. వెనువెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసినట్లు తెలుస్తోంది. అయితే కోకాపేట లేక్ వద్ద ఉన్న ఆ సెట్ లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ తో భోళా శంకర్ మూవీ చేస్తుండగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన కెరీర్ 15వ మూవీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :