విడుదలకు ముందే 10 నిముషాల సినిమాను ప్రదర్శించనున్న విజయ్ !

12th, November 2017 - 07:05:42 PM

తమిళ హీరో విజయ్ ఆంటోనీ సినిమాలకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ‘బిచ్చగాడు, బేతాళుడు’ వంటి సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఆయన తన ప్రతి సినిమాని తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. తాజగా ఆయన నటించిన ‘అన్నాదురై’ సినిమా తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో విడుదలకానుంది.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ నవంబర్ 15న భారీ ఎత్తున ఆడియో వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో టీజర్, ట్రైలర్లతో పాటు సుమారు 10 నిముషాల సినిమాను ప్రదర్శించనున్నారట. విజయ్ ఆంటోనీ గతంలో తాన్ ‘బేతాళుడు’ చిత్రానికి కూడా ఇదే తరహా పద్దతిని పాటించి ఆ చిత్ర ఆడియో వేడుకలో 15 నిముషాల సినిమాను విడుదలచేసి మంచి ప్రచారాన్ని పొందాడు. ఇదే ఫార్ములాను ఈ ‘ఇంద్రసేన’ కు కూడా ఫాలో అవుతున్నారాయన. జి.శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవంబర్ 30న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.