కమల్ “విక్రమ్” ఫస్ట్ గ్లాన్స్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Nov 5, 2021 5:17 pm IST

కమల్ హాసన్ హీరోగా, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ మరియు ఆర్.మహేంద్రన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల అయ్యి ఇప్పటికే ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ దర్శకుడు లోకేష్ కనగరాజు ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ తో పాటుగా విక్రమ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లాన్స్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అప్డేట్ తో కమల్ హాసన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More