“పవర్ స్ట్రామ్” టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ కి డేట్ ఫిక్స్!

Published on Aug 13, 2021 4:58 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ సాగర్ కె చంద్ర దర్శకత్వం లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి మరొక హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ కోసం పవన్ కళ్యాణ్, రానా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా కి సంబందించిన ఒక అప్డేట్ ను ప్రకటించడం జరిగింది. ఆగస్ట్ 15 వ తేదీన ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఉదయం 9:45 గంటలకు విడుదల చేస్తున్నట్లు చెప్పుకు రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు మరియు మేకింగ్ వీడియో సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :