సందీప్ కిషన్ “మైఖేల్” ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్!

Published on May 7, 2022 12:21 am IST


టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అయిన సందీప్ కిషన్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. ఈ చిత్రం ను పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాల పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ను అనౌన్స్ చేసిన అప్పటి నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి మరియు గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మే 7 న ఉదయం 10:08 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఒక మోషన్ పిక్చర్ ద్వారా వెల్లడించడం జరిగింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :