ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకుంటున్న జెడి చక్రవర్తి ‘దియ’

Published on Jun 4, 2023 12:01 am IST

ఇటీవల ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి చిత్రాలకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు పవన్ సాదినేని ఇప్పుడు దయా అనే వెబ్ సిరీస్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక ఈ సిరీస్ టైటిల్‌ను దర్శకుడు నిన్న ప్రకటించారు. అలానే ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు దియ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో జెడి చక్రవర్తి ఏదో లోతుగా ఆలోచిస్తూ ఉండటం చూడవచ్చు.

ఫీల్ ద రేజ్ అనేది ఈ సిరీస్ యొక్క ట్యాగ్‌లైన్. ఈ సిరీస్ త్వరలో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రదర్శితం కానుంది. జెడి చక్రవర్తితో పాటు, ఈ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బా, రమ్య నంబేసన్ మరియు కమల్ కామరాజు ఇతర ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌లో జెడి 2.0ని ప్రేక్షకులు చూస్తారని దర్శకుడు పవన్ సాధినేని హామీ ఇస్తున్నారు. కాగా ఈ క్రేజీ సిరీస్ గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :