’35’ కుటుంబాన్ని ప‌రిచ‌యం చేసిన నివేదా!

’35’ కుటుంబాన్ని ప‌రిచ‌యం చేసిన నివేదా!

Published on Jul 3, 2024 11:34 AM IST

యంగ్ బ్యూటీ నివేదా థామ‌స్ ఇటీవ‌ల సినిమాలు చాలా సెలెక్టివ్ గా చేస్తూ వ‌స్తోంది. ఆమె కొంతగ్యాప్ త‌రువాత చేస్తున్న మూవీ ’35 – చిన్న క‌థ కాదు’ ప్ర‌స్తుతం రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేక‌ర్స్.

”ఇదో, మా సిన్న కుటుంబం తొలి సూపు” అంటూ ఈ మూవీలోని మెయిన్ క్యాస్టింగ్ ఉన్న పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఇందులో నివేదా థామ‌స్ ఓ మ‌ధ్య త‌ర‌గతి గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను నేడు సాయంత్రం 6 గంట‌లకు రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, విశ్వ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను రానా ద‌గ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తుండ‌గా, వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. నందకిషోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు