నెట్ మూవీ టీజర్ ను విడుదల చేయనున్న డైరక్టర్ విక్రమ్ కే కుమార్!

Vikram Kumar

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా చాలా చిత్రాలు థియేటర్ల లో కంటే ఓటిటి ద్వారా విడుదల అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అవిక గోర్ ప్రధాన పాత్రలో, రాహుల్ రామకృష్ణ, ప్రణీత పట్నాయక్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం నెట్. ఈ చిత్రం కి సంబంధించిన అవిక గోర్ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం జీ 5 లో డైరెక్ట్ ఓటిటిగా విడుదల కానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10 వ తేది నుండి జీ 5 లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ తో పాటుగా పలు అప్డేట్స్ ను చిత్ర యూనిట్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

Exit mobile version