ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Published on Dec 20, 2022 8:03 PM IST


యువ నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పోస్టర్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్ నిర్మిస్తున్న ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి సినిమా కావడం బేబీ సినిమాకు మంచి ప్లస్ అనే చెప్పాలి.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ నుండి ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పల్లవితో సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. తొలిప్రేమ అంత స్వచ్ఛంగా సాగిన ఈ సాంగ్ కి అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ దీనికి ట్యూన్ అందించారు. యువ గాయకుడు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా ఆలపించిన ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ప్రస్తుతం యూత్ ని ఎంతో ఆకట్టుకుంటూ కొనసాగుతోంది. ఇక వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకి బేబీ మూవీని తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్న యూనిట్, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ఈ మూవీకి సినిమాటోగ్రఫీని బాల్ రెడ్డి అందిస్తుండగా ఎడిటింగ్ ని విప్లవ్, ఆర్ట్ ని సురేష్ అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు