అఖండ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందట..!

Published on Aug 22, 2021 2:00 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టుకోబోతుంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్ అతి త్వరలోనే రానున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తమన్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ దసరాకు అఖండ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8 లేదా 13వ తేదీని ఈ సినిమా విడుదలకు లాక్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :